కరీంనగర్ లో ఉద్రిక్తత!

కరీంనగర్ లో ఉద్రిక్తత!
  • హనుమాన్ భక్తుల ర్యాలీ ఫై దాడులు 
  • బీజేపీ ఆధ్వర్యంలో మూడో టౌన్ ముందు నిరసన 
  • దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ 


ముద్ర ప్రతినిధి, కరీంనగర్:- కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా వద్ద శనివారం రాత్రి 10 గంటలకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హనుమాన్ మాలదారులు ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ మాలాధారులు ఆందోళన చేపట్టారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేసే క్రమంలో హనుమాన్ భక్తులకు  పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. పోలీసులు అదుపు చేసే క్రమంలో స్వల్ప లాటి ఛార్జ్ చేశారు.  ఈ సంఘటన ఫై బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ మూడో పోలీస్ స్టేషన్ ముందు రాత్రి 10.20 గంటల సమయంలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్టితి నెలకొంది. అనంతరం బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.