రోడ్డు మీద వరి నాటు వేసి నిరసన

రోడ్డు మీద వరి నాటు వేసి నిరసన

శంకరపట్నం ముద్ర జూలై 21: మండల పరిధిలోని కేశవపట్నం - పాపయ్యపల్లి గ్రామాలని కలిపే మట్టి రోడ్డుపై శుక్రవారం నాడు వరి నాటు వేసి బిజెపి పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తారు రోడ్డు వేస్తామని ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇచ్చిన హామీని 9 సంవత్సరాలు గడిచినా కూడా నెరవేర్చలేకపోయారని వారు ఆరోపించారు . ఇటీవల కురుస్తున్న వర్షాలకి మట్టి రోడ్డు బురదమయం కావడంతో స్థానిక ఎంపిటిసి, బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు.

గ్రామస్తులకు ఈ రోడ్డు ద్వారా రాకపోకలకు అంతరాయం కలుగుతుందని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన పట్టించుకోవడంలేదన్నారు.కార్యక్రమములో బీజేపీ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి,అధికార ప్రతినిధి అలుగువెల్లి సమ్మిరెడ్డి,గ్రామ బూత్ అధ్యక్షులు చెంచు సంపత్,బీజేపీ మండల నాయకులు దాసరపు నరేందర్,ఎల్కపెల్లి సంపత్,మందాడి జగ్గారెడ్డి,కాంతాల రాజిరెడ్డి,కుమారస్వామి,రాజేందర్,వెంకటలక్ష్మి,కనకం సాగర్,బిజిలి సారయ్య,రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,గొల్లిపెల్లి శ్రీను,బొజ్జ సాయి, అర్జున్.అఖిల్,పల్లె శివారెడ్డి,గ్రామస్తులు ప్రభాకర్,సదానందం,నారాయణ తదితరులు పాల్గొన్నారు.