పల్లెల్లో టిడిపికి పూర్వవైభవం తేవాలన్నదే లక్ష్యం.. 

పల్లెల్లో టిడిపికి పూర్వవైభవం తేవాలన్నదే లక్ష్యం.. 
  • తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు 

ముద్ర/షాద్ నగర్:- గ్రామీణ ప్రాంతాల్లో టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు వివరించారు. మంగళవారం ఫరూక్నగర్ మండల పరిధిలోని కొండన్నగూడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టిడిపి అభిమానులు ఇప్పటికీ అనేకమంది ఉన్నారని వివరించారు. గ్రామ గ్రామా న టిడిపి జెండాను ఆవిష్కరించడం పాటు ప్రజల్లో చైతన్యం తీసుకోవచ్చు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీ చేసేందుకు టిడిపి శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  తెలుగుదేశం పార్టీ బలోపేతం కాబోతుందని మిగతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా టిడిపి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.  తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి, బూర్గుల కుమార్ గౌడ్,బుర్గులు వెంకటయ్య గౌడు,శివ గంధం ఆనంద్ లు పాల్గొన్నారు.