పేదల సంక్షేమం మోడీ లక్ష్యం

పేదల సంక్షేమం మోడీ లక్ష్యం
  • బిజెపి రాష్ట్ర నాయకుడు సుభాష్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పేదల సంక్షేమం కోసం ప్రధాని మోడీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్ అన్నారు. జనగామ  జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ లో గురువారం ఇంటింటా బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నారు. మహా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా నష్కల్ గ్రామం103, 104, 105 పోలింగ్ బూత్ లో ఇంటింటికి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాలలో చేసినటువంటి పథకాలు వివరించి కరపత్రాలు ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మూడు కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు, రూ. 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. 6 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ఎరువులకు పెద్ద ఎత్తున సబ్సిడీ, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 90% అందజేస్తున్నది. 7 లక్షల వరకు ఆదాయ పన్ను పూర్తి పన్ను రాయితీ, పేదలకు ఉచిత గ్యాస్ లు అందజేసినారు. తొమ్మిది సంవత్సరాల్లో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం ద్యేయంగా బిజెపి ప్రభుత్వం పని పనిచేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో 103 బూత్ అధ్యక్షులు మందపురి శంకర్, సీనియర్ నాయకులు హరిపల్ రెడ్డి, మండల కన్వీనర్ గూగులోతు మధు నాయక్, మండల ఉపాధ్యక్షులు కదుగాయ రమేష్, సోషల్ మీడియ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కార్తిక్ రెడ్డి, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు బాల్నె శ్రీనివాస్, దళిత మోర్చ మండల అధ్యక్షులు బాణాల శ్రీను, బిజెపి నాయకులు గంటే ఉపేందర్ యాదవ్, ముక్కెర శ్రవణ్ యాదవ్, రమేష్, బూత్ ఉపాధ్యక్షులు మోడెమ్ గణేష్, రంగు ఎల్లయ్య, చిర్ర బాబు పాల్గొన్నారు.