చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా...

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- స్కిల్ డెవలప్ మెంటు కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ 10 వారాల తర్వాత ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.