సిద్దిపేట అభివృద్ధి పై శ్వేతా పత్రం విడుదల చేయాలి

సిద్దిపేట అభివృద్ధి పై శ్వేతా పత్రం విడుదల చేయాలి
  • నిజాలతో కాంగ్రెస్ అబద్దాలతో బిఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతున్నాం
  • అందరిని కలుపుకుని విజయం సాధిస్తాం
  • సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: నిజాలతో కాంగ్రెస్, అబద్దాలతో బిఆర్ఎస్ ప్రజల్లోకి వెలుతున్నామని, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరి కృష్ణ అన్నారు. ఆదివారం సిద్దిపేట లోని తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధి పై హరీష్ రావు శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చెశారు. అభివృద్ధి అంటే రోడ్లు, డివైడర్లే నా అని ప్రశ్నించారు.  సిద్దిపేట లో యువత ఉద్యొగల్లేక ఆవేదన చెందుతున్నారని ఉపాధి కల్పనకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకూ తీసుకోలేదని అన్నారు. కనీసం ఒక్క పరిశ్రమ అయిన ఇక్కడ ఏర్పాటు చెశార అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాడానికి 2013 చట్టం  కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు బిఆర్ఎస్ హయాంలో రోడ్లకని, ప్రాజెక్ట్ లకని రైతుల భూములు గుంజుకొని మోసం చేశారని మండి పడ్డారు. సిద్దిపేట లో వైద్యం బాగుంటే మొన్న దుబ్బాక లో జరిగిన సంఘంటన కు కొత్తప్రభాకర్ రెడ్డి ని సిద్దిపేట కు కాకుండా హైదరాబాద్ ఎందుకు తీసుకెలాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తనని ప్రకటించిన తర్వాత సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు అందరిని కలిశానని నాయకులు ఆనందం వ్యక్తం చేశారని  తెలిపారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రజల వద్దకు వెళుతామని తెలిపారు...నియోజకవర్గ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతానని అన్నారు..కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి చేర వేసేలా కార్యకర్తలు కృషి చేయాలని. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చెయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమాం, దరిపల్లి చంద్రం, గంప మహేందర్, బొమ్మల యాదగిరి. ముద్దం లక్ష్మీ,కలీముద్దీన్,వాహబ్ అజమత్ తదితరులు పాల్గొన్నారు.