మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ఎమ్మెల్యేగా పద్మను గెలిపించాలని విజ్ఞప్తి

మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ఎమ్మెల్యేగా పద్మను గెలిపించాలని విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మెదక్ పట్టణంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,  రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల మేనిఫెస్టో కరపత్రాలు అందజేస్తూ బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పే నాయకుల మాటలు వినరాదని, నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పరితపించే నాయకులను ఎన్నుకోవాలని కకోరారు. పట్టణంలోని 6,7 వార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్,  కౌన్సిలర్లు రాగి వనజ అశోక్, ఆర్కె శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గంగాధర్, నాయకులు పూజల వెంకటేశ్వర్లు(చిన్న), చింతల నర్సింలు, మేడి మధుసూదన్ రావు, బొద్దుల కృష్ణ, అంజద్, లింగారెడ్డి, కాసాపురం మధు, మాడిశెట్టి అంజయ్య, నిఖిల్, శ్రీకాంత్, నర్సొజీ, కిరణ్, సీతారాం, సోను తదితరులున్నారు.