పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం

పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం

సమాజంలో అందరూ బాగుండాలని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ అన్నారు. ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ  సీనియర్​ ఎన్​టీఆర్​ పార్టీ పెట్టినప్పుడు ఇన్ని పార్టీలు లేవన్నారు. ఆయనకు అధికారం త్వరగా వచ్చింది. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. వందల వేల కోట్లు లేకపోయినా సంకల్పబలంతో పార్టీని నడుపుతున్నాం.

జీరో బడ్జెట్​ పాలిటిక్స్​ అని నేనెప్పడూ అనలేదు. నేను ఒక కులానికి నాయకుడిని కాను అన్నారు. నాకు అంత త్వరగా అధికారం వస్తుందని అనుకోవడంలేదు. గజమాలలు వేస్తే నేను సీఎం కాలేను. హారతులు ఇస్తే నేను సీఎం కాలేను. ఓట్లు వేస్తే సీఎంని అవుతానన్నారు.