ఈవీఎంల ప్రక్రియ లో ఏమైనా సందేహాలు ఉంటే ఆయా రాజకీయ పార్టీలు  నివృత్తి  చేసుకోవాలి 

ఈవీఎంల ప్రక్రియ లో ఏమైనా సందేహాలు ఉంటే ఆయా రాజకీయ పార్టీలు  నివృత్తి  చేసుకోవాలి 

 జిల్లా కలెక్టర్.జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన 

 నల్లగొండ ముద్ర ప్రతినిధి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవిఎం) రాండమైజేషన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన్నట్లు జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈవీఎంల రాండమైజేషన్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలని ఆమె రాజకీయ పార్టీల ప్రాతినిధులతో కోరారు. లోకసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల  రాండమైజేషన్  ప్రక్రియను పూర్తి చేశారు.      రాండమేషన్ ప్రక్రియలో ఏమైనా  అనుమానాలు ఉన్నాయా? అని  జిల్లా కలెక్టర్ పార్టీల  ప్రతినిధులను అడుగగా,రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎటువంటి అనుమానాలు లేవు అని సమాధానం ఇవ్వడంతో  ఈవీఎంల  మొదటి రాండమేషన్  ప్రక్రియను పూర్తి చేశారు.

అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటుచేసిన  ఈవీఎంల గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేసి ఈవీఎంలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ జె.  శ్రీనివాస్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, ఈవీఎంల నోడల్ ఆఫీసర్ పులిచింతల స్పెషల్ కలెక్టర్ నటరాజ్,6 నియోజకవర్గాల ఏఆర్వోలు హాజరు కాగా, రాజకీయ పార్టీల తరఫున బిజెపి అధికార ప్రతినిధి  లింగస్వామి, కాంగ్రెస్ ప్రతినిది జూలకంటి సైదిరెడ్డి, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, బి ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా,ఆమ్ ఆద్మీ పార్టీ  జనరల్ సెక్రెటరీ  యారా శ్రీను  తదితరులు  హాజరయ్యారు.