ముత్తారం సింగిల్ విండో కార్యాలయంలో రికార్డులు సీజ్...

ముత్తారం సింగిల్ విండో కార్యాలయంలో రికార్డులు సీజ్...

 జిల్లా సహకార సంఘం సీనియర్ ఇన్ స్పెక్టర్ మహమ్మద్ ముసాసిర్ హైమద్ విచారణ

ముద్ర ముత్తారం ముత్తారం సింగిల్ విండో కార్యాలయంలో గత ఐదేళ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని ఫిబ్రవరి 5న జిల్లా కలెక్టర్ కు మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజయ్య ఫిర్యాదు చేశాడు. రాజయ్య ఫిర్యాదు మేరకు జిల్లా సహకార సంఘం సీనియర్ ఇన్ స్పెక్టర్ మహమ్మద్ ముసాక్ సీర్ అహ్మద్ గురువారం విచారణ చేపట్టారు. సొసైటీ లో జరిగిన రశీదులు, వరి ధాన్యం కొనుగోలు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను సీజేసి పట్టుకెళ్లాడు. విచారణ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఫిర్యాదారుడు మద్దెల రాజయ్య ను పిలిచి విచారించారు.