రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టి

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టి
  • అధికారులు,పాత్రికేయుల ప్రమేయంపై ఆరా
  • ముద్ర న్యూస్ వార్త కథనానికి స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

కాటారం,ముద్ర న్యూస్: పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది.గత కొన్ని ఏళ్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు కాలేశ్వరం,మేడిగడ్డ,అన్నారం ప్రాంతాల గుండా మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది.ఈ వ్యవహారంపై ముద్ర న్యూస్ ఎప్రిల్ 8న "పేదల బియ్యం దళారుల పాలు"అనే వార్తా కతనం ప్రచురించింది.దీంతో ఉత్తర తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు విచారణ మొదలెట్టారు. కరోనా సమయం నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగానే బియ్యం సరఫరా చేస్తున్నాయి.ఈ దశలో దళారులు రంగ ప్రవేశం చేసి పేదల కడుపు నింపాల్సిన వీడియోస్ రైస్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు.

ప్రతినెల పంపిణీ జరుగుతున్న రేషన్ బియ్యం పేద కుటుంబాలకు చెందకుండా అక్రమార్కుల జేబులు నింపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ రవాణాలో రెవెన్యూ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి పాత్రికేయుల వరకు ఉన్న ప్రమేయంపై ముద్ర దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ముద్ర దినపత్రిక కథనానికి స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ఉదృతం చేసినట్లు సమాచారం.విచారణ నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారి తెలియజేశారు.