వనం నుండి జనంలోకి అమ్మవార్లు

వనం నుండి జనంలోకి అమ్మవార్లు
  • గండొర్రె గుట్ట నుండి శ్రీనాగులమ్మ.. 
  •  పాలమాకు ఒర్రె నుండి వన దేవత..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: లుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ నర్సాపురంలో జరుగుతున్న శ్రీ నాగులమ్మ  జాతరలో భాగంగా మూడవ రోజైన గురువారం శ్రీనాగులమ్మ అమ్మవారు గండొర్రె గుట్ట నుండి మణి రూపంలో గుట్ట క్రిందకు చేరుకుంది. శ్రీ నాగులమ్మ ఆలయ సమీపంలో ఉన్న గండొర్రె గుట్ట ప్రాంతంలో  గురువారం పూజారులు, వడ్డెలు పూజలు జరిపి, అనంతరం శ్రీనాగులమ్మ అమ్మవారిని రాజుపేట మెయిన్ సెంటర్ కు తీసుకువచ్చారు. గురువారం తెల్లవారు జామున పాలమాకు ఒర్రె సమీపంలో ఉన్న వన దేవతకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన దేవతను ఎర్రమ్మ తోగు గుండా రమణక్కపేట మీదుగా రాజుపేట బస్ స్టాండ్ సెంటర్కు తీసుకువచ్చారు. పాలమాకు ఒర్రె నుండి తీసుకువచ్చిన వనదేవతకు, గండొర్రె గుట్ట నుండి తీసుకువచ్చిన శ్రీనాగులమ్మకు రాజుపేట మెయిన్ సెంటర్లో దారెల్లితో ఎదుర్కోళ్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  

ఎదుర్కోళ్ళు కార్యక్రమం అనంతరం శ్రీనాగులమ్మ, వన దేవతలను ఆలయానికి తీసుకువచ్చి శ్రీనాగులమ్మ ధర్మపీఠం వద్ద ప్రతిష్టించారు. సాయంత్రం చుంచుపల్లి గ్రామం నుండి కొమరం వారి ఇంటి నుండి అడా రాలను తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. జాతరలో పోక్ డ్యాన్సర్ జానులిరి  పాటలు, డ్యాన్స్ లు, సాంసృతిక కార్యక్రమాలుతో పాటు ఆదివాసీ సాంసృతిక నృత్యాలు జాతరకు విచ్చేసిన వారిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ ( దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగరమేష్, సడాలమ్మ పూజారి కొమరం ధనలక్ష్మి, బాడిశ నవీన్,  కొమరం పాపారావు, ఇర్ప నాగ లక్ష్మి, వడ్డెలు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క, కట్టం సమ్మక్క, ముయబోయిన శివ, కుర్సం నరేష్, కారం రాజేష్, సోడి శివ నాగేశ్వరి, చౌలం భవాని, కుర్సం హేమలత ,కారం రమాదేవి, మడకం సుప్రజ, పేరాంటాల్లు కుర్సం సీతక్క, కొర్స సమ్మక్క , కారం సుభలక్ష్మి, కుల పెద్దలు కుర్సం విష్ణుమూర్తి, కొమరం మాధవ రావు, కోర్స నర్సింగ రావు, మడకం రాజేశ్వర్ రావు, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.