బేగంపేట విమానశ్రయానికి బాంబు బెదిరింపు...

బేగంపేట విమానశ్రయానికి  బాంబు బెదిరింపు...

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. ఎవరు మెయిల్ చేశారనేదానిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బేగంపేట విమానశ్రయానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు.

విమానశ్రయం వైపు ఎవరినీ రానీయడం లేదు. నిజంగా బాంబు పెట్టారా.. లేదా ఎవరైనా ఆకతాయిలు మెయిల్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో, ప్రభుత్వ భవనాలు, స్థలాల్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా భద్రతా అధికారుల తనిఖీల తర్వాత అవి ఫేక్ కాల్స్‌గా తేలాయి. ప్రస్తుతం బేగంపేట విమానశ్రయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించి.. తనిఖీలు చేస్తున్నారు.