ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుద‌ల

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుద‌ల

ముద్ర,తెలంగాణ:-తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలన సైతం పూర్తవ్వడంతో ఇవాళ మధ్యహ్నం 2గంటలకు విడుదల చేశారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల మార్కులను కూడా విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ , ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, https://results.cgg. gov.in వెబ్‌సైట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు