పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి -  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి -   ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- పేదింటి ఆడబిడ్డల కుటుంబాలలో కళ్యాణ లక్ష్మి గొప్ప వరంలాగా మారిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని జూలూరు గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్ర భవనానికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, డిఎంహెచ్వో పాపారావు, తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్, మండల వైద్యాధికారి శ్రీవాణి, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, నాయకులు తడక రమేష్ ,కాసుల అంజయ్య గౌడ్, ఉప్పునూతల వెంకటేష్, పాక రమేష్, సీత సుధాకర్, ఆడేపు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.