మత్తుతో జీవితాలు చిత్తు–యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మత్తుతో జీవితాలు చిత్తు–యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
  • మాదకద్రవ్యాలు వాడకంతో నష్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర.వనపర్తి:-యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ వైపు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని వనపర్తి పట్టణం లోని స్థానిక బాయ్స్ జూనియర్ కళాశాల నండి పాలిటెక్నిక్ కళాశాల వరకు మాదకద్రవ్యాలు నిరోధం(సే నో టు డ్రగ్స్) అనే అంశంపై విద్యార్థులుతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,మరియు జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి  జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ... చదువుకున్న వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు.యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి, మత్తు పదార్థాలు మనుషులు ఆరోగ్యాలను చేస్తున్నా యని ఎంతోమంది జీవితాలు అభ్యంతరంగా ముగిసిపోతున్నా రని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెడు విన్యాసాలకు బానిసైతే వారి కుటుంబాలు చిన్న భిన్నం కాక తప్పదని అని అన్నారు.


జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని  జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు.సమాజంలో ప్రభుత్వం నిషేధించిన కొన్ని రకాల మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత పోలీసువారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఆయన సూచించారు. నిషేధిత మాదక ద్రవ్యాలు యొక్క సమాచారాని తెలియజేసి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు డ్రగ్స్,  గంజాయి, కో కెన్ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.ర్యాలీల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్, వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు  వనపర్తి వర్టికల్ ఇన్చార్జి డిఎస్పి కృష్ణ కిషోర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ముని, వనపర్తి సిఐ కొత్తకోట సీఐ, ఎస్సైలు పోలీస్ సిబ్బంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు.