ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి వినతి – సిపిఎం మండల నాయకులు

ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి వినతి  – సిపిఎం మండల నాయకులు

ముద్ర.వీపనగండ్ల:- గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వీపనగండ్ల గ్రామానికి వచ్చిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో సిపిఎం మండల నాయకులు ఆశన్న,ఈశ్వర్  మాట్లాడుతూ గ్రామంలోడ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, వీధిలైట్లు వెలగడం లేదని, ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ లేక విద్యార్థులు ఆందోళనలో గురవుతున్నారని వెంటనే టీచర్స్ ను నియమించాలని కోరారు.

ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన డాక్టర్స్,సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు గురవుతున్నారని,  డాక్టర్స్ ను సిబ్బందిని నియమించాలని వినతి పత్రంలో కోరారు. గోపాల్ దీన్నే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, రుణమాఫీ లిస్టు బ్యాంకుకి ఇచ్చి, వానకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు, కలెక్టర్  మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు  శ్రీనివాసులు, రాముడు,ప్రజలు పాల్గొన్నారు.