ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే  జిల్లా కలెక్టర్ ను  అయ్యాను.!

ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే  జిల్లా కలెక్టర్ ను  అయ్యాను.!
  • చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తేగలుగుతుంది..!
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక.!
  •  ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్.!
  • విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేత..!

ముద్ర, షాద్ నగర్: జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్ప మార్పు తేగలుగుతుందని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో  చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు  ఫరూక్ నగర్  మండలం మొగలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ  పాఠశాలల పున ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్  బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన లభిస్తుందన్నారు అన్ని రకాల  వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వలు అందిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి  రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశిందర్ రావు  ఫరూక్ నగర్ మండల ఎంఈఓ శంకర్ రాథోడ్ జెడ్పిటిసి వెంకట్ రామిరెడ్డి ఎంపిటిసి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.