బాన్సువాడలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

బాన్సువాడలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

బాన్సువాడ, ముద్ర: రానున్న పండుగల దృష్ట్యా శాంతి, సామరస్యం కోసం బాన్సువాడ పట్టణంలో శనివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించారు.  ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ నుంచి గాంధీ చౌక్, వీక్లీ మార్కెట్, బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ శాంతి సామరస్యం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.  టౌన్ సిఐ మహేందర్ రెడ్డి, రూరల్ సిఐ మురళి, ఎస్సైలు పాల్గొన్నారు