మంథని లో మర్డర్ల పై అభివృద్ధిపై చర్చ జరగాలి

మంథని లో మర్డర్ల పై అభివృద్ధిపై చర్చ జరగాలి

తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాయం

మచ్చుపేట బహిరంగ సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని నియోజవర్గంలో మర్డర్ల పై చేసిన అభివృద్ధిపై చర్చ జరగాలని, తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు తీసుకువస్తుందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాయమని మచ్చుపేట బహిరంగ సభలో మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ముత్తారంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మచ్చుపేట బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ అవినీతి ప్రభుత్వంపై ప్రజలు విసుగుపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలను హమీలకే పరిమితం చేసి పాలనను బ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ కు బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నా రాబోయో రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని భరోసా కల్పించారు. మంథనిలో మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ తోటే సాధ్యమన్నారు. గుంట భూములేని వారి కి రూ. 12 వేల రైతుబంధు ఇస్తామన్నారు. మహిళలకు పావుల వడ్డీకి లేదా ఉచితంగా రుణాలు ఇస్తామని తెలిపారు. బెల్ట్ షాపులు లేకుండా గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటుచేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఉచితంగా ఇండ్ల స్థలాలతోపాటు ఐదు లక్షలతో గృహ నిర్మాణం కూడా చేపడతామన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు, మంథని నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా మర్డర్లకు తావు లేకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ముత్తారం, మండల నాయకులు

కాంగ్రెస్ పార్టీలో ముత్తారం, మందని మండలాకు చెందిన దాదాపు 300 మంది మచ్చుపేటలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో కండువలు కప్పుకొని కాంగెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, నాయకులు మద్దెల రాజయ్య, వాజిద్ పాషా, బియ్యని శివకుమార్, గోవిందుల పద్మ ఆనంద్, దుండె రాజేందర్, చిలువేరి లక్ష్మణ్, బక్కతట్ల కుమార్, అల్లం కుమారస్వామి, చెలకల జితేందర్ యాదవ్, చొప్పరి సంపత్, బండ సమ్మయ్య, గాదం శ్రీనివాస్, జంగ మోహన్ రెడ్డి, సింగరేణి సమ్మె యాదవ్, అనుము సమ్మయ్య, పెగడ కుమార్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నవారు.