కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ... మాటల్లో కాదు చేతల్లో!: చంద్రబాబు

కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ... మాటల్లో కాదు చేతల్లో!: చంద్రబాబు
  • అనంతపురం జిల్లాలో అంధురాలి ఆత్మహత్య
  • పింఛను నిలిపివేశారంటూ పురుగు మందు తాగిన వైనం
  • ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం అని పేర్కొన్న చంద్రబాబు

అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు పింఛను తొలగించారంటూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తమ్ముడికి రైల్వే ఉద్యోగం వచ్చినందున ప్రభుత్వం ఆమె పింఛను నిలిపివేసినట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ... మాటల్లో కాదు చేతల్లో" అంటూ విజ్ఞప్తి చేశారు. 

ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగించడం కర్కశత్వం అని చంద్రబాబు విమర్శించారు. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయ విదారకరం అని పేర్కొన్నారు. ఈ మేరకు సరోజమ్మ ఆత్మహత్య వార్త తాలూకు క్లిప్పింగ్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పంచుకున్నారు.