పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో  సామూహిక సత్యనారాయణ వ్రతం

పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో  సామూహిక సత్యనారాయణ వ్రతం

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పట్టణంలోని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో కార్తీకమాసం సందర్బంగా ఆదివారం  సామూహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ  సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను ఐదు కథలను సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ దంపతులు కాలేరు లక్ష్మణ్ అర్చన, పాదరాజు రాఖేశ్ స్వాతి, పోతుగంటి వెంకటేశ్వర్లు భవాని, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.