భారత రాష్ట్ర పతిని కలిసిన జాటోత్ హుస్సేన్ నాయక్..
మహబూబాబాద్, ముద్రప్రతినిధి: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్మును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన జాటోత్ హుస్సేన్ నాయక్ శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన పోన్ లో మహబూబాబాద్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశంలోని గిరిజనవర్గాల అభివృద్ధికోసం, అన్నివర్గాల సంక్షేమంకోసం కృషి చేస్తుందని అన్నారు.
ఆదివాసీ గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళను దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిలో నియమించడం గిరిజనులకు దక్కిన అరుదైన గౌరవం అని హుస్సేన్ నాయక్ అన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దఎత్తున ఎస్టీకమిషన్ నిధులు కేటాయించేందుకు తనవంతు కృషిచేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎస్టీకమిషన్ చైర్మన్, సభ్యులు, తదితరులు ఉన్నట్లు ఆయన తెలిపారు.