బంధం చెరువు కు హద్దులు ఏర్పాటు చేయాలి..

బంధం చెరువు కు హద్దులు ఏర్పాటు చేయాలి..
  •  మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: బంధం చెరువు పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ లో సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బంధం చెరువు పరిరక్షణ కొరకు  సర్వే నెంబర్లతో సహా శిఖం భూములపై రెవెన్యూ మున్సిపాలిటీ సర్వే అధికారులు తో కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. బంధం చెరువు పరిరక్షణకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, హద్దులు తెలిపేందుకు ఏర్పాటు చేయాలన్నారు. శిఖంభూములలో ఆక్రమణలు ఉంటే తొలగించాలన్నారు బోర్డు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి‌కి సూచించారు.

కొత్త నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత చెరువు రూపురేఖలు తెలిపేలా మ్యాపులు రూపొందించి ఇవ్వాలన్నారు. నిజాం చెరువు, కంబాలచెరువులను కూడా సర్వే చేపట్టాలని హద్దులు తెలిపేలా మ్యాపులు రూపొందించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తోపాటు ఆర్డీఓ కొమరయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, డిఈ ఉపేందర్, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.