కార్యకర్తలకు.. నాయకులకు మద్య ఆత్మీయవారది.. 

కార్యకర్తలకు.. నాయకులకు మద్య ఆత్మీయవారది.. 
  • ఆత్మీయసమ్మెళనాలతో అనేక విషయాలు తెలుస్తాయి
  • కార్యకర్తల శ్రమకు భారాసలో ఖచ్చితమైన గుర్తింపు
  • మానుకోటలో మంత్రి సత్యవతిరాథోడ్ 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: ఆత్మీయ సమ్మేళనం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మధ్య మంచి వారధిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయసమ్మెళనంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. భారసలో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఖచ్చితమైన గుర్తింపు లభిస్తుందని, మంచిఅవకాశాలు వస్తాయని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బారీ మెజారిటీతో  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని, ప్రతిపక్షాల మతిలేని మాటలను ప్రజలు పట్టించుకోవడంలేదని, కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే విశ్వసిస్తున్నారని సత్యవతిరాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని,త్వరలోనే రైతులకు పోడు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. దేశంలోనే ఎక్కడ ఇవ్వని పంట నష్టపరిహారం రైతులకు ఇవ్వబోతున్న గొప్ప నాయకుడు సీఎం కెసిఆర్ అని అభినందించారు.

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, సమయానుకూలంగా మంచి అవకాశాలు అందుతాయని ప్రతిఒక్కరు మరింత పట్టుదలతో పనిచేయాలని మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. కేంద్రంలో బీజేపీ పార్టీ సీఎం కెసిఆర్ ఇమేజ్ నీ చూసి భయపెడుతున్నదని, దేశంలో అవినీతి నిర్మూలన సంస్థలు బిజెపి నాయకుల అహంకారానికి భ్రష్టు పట్టిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఇంటికి పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమఫలాలను అందుకోని ఇల్లు, వ్యక్తి మనరాష్ట్రంలో ఒక్కరుకూడా ఉండరని మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లో ప్రచారం చేయడం ప్రతికార్యకర్త, నాయకులు, ప్రజాప్రతినిధులు తమ బాద్యతగా బావించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జెడ్పీ చైర్మన్  అంగోత్ బిందు, ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.