ప్రజలు విధిగా అస్తి పన్ను బకాయిలు 31 మార్చ్ లోపు చెల్లించాలి  జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష

ప్రజలు విధిగా అస్తి పన్ను బకాయిలు 31 మార్చ్ లోపు చెల్లించాలి  జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  ప్రజలు విధిగా అస్తి పన్ను బకాయిలు 31 మార్చ్ లోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని  జగిత్యాల జిల్లా కలెక్టర్  షేక్ యస్మిన్ భాష పట్టణ వాసులను కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన అస్తి పన్నుల వసూలు పై ఏర్పాటు చేసిన మున్సిపల్ అత్యవసర సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వార్డు వారీగా ఇంటి పన్నుల బకాయిలపై సమీక్ష చేశారు. వార్డు సభ్యులు అందరూ పట్టణ అభివృద్ధి కోసం  100 శాతం పన్నులు వసూలు కై ప్రజలకు అవగాహన కల్పించి పన్నులు వసూలు చేయించి సహకరించాలన్నారు.

ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న వారిని గుర్తించి  అవగాహన కల్పిస్తూ వసూలు చేయించాలని, ఒకేసారి పన్ను చెల్లించలేని వారు పాక్షికముగా చెల్లించే వెసులు బాటు ఉన్నదని , డిస్కౌంట్, వడ్డీ మాఫీ లాంటి అవకాశములు ఏమి లేవని ఇట్టి విషయంలో ప్రజలలో నెలకొన్న అపోహలు నివృత్తి చేసి పన్నులు కట్టించాలని తెలిపారు. 100 శాతం పన్నులు వసూలు చేయని యెడల 15వ ఫైనాన్స్ గ్రాంట్స్ నిలిపివెయబడుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. చైర్మన్ గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ  కలెక్టర్ సూచనల ప్రకారము పట్టణ అభివృద్ధి కొరకు  100 శాతం పన్నుల వసూలుకు వార్డు సభ్యులందరం సహకరిస్తామని జగిత్యాల పట్టణమును ముందంజ లో ఉండే విధముగా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్, మున్సిపల్ కమిషనర్ బి. నరేష్, వార్డు కౌన్సిలర్లు, కొ ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.