ప్రశ్నిస్తే పలితాలు రావు - పనిచేస్తే పలితాలు వస్తాయి

ప్రశ్నిస్తే పలితాలు రావు - పనిచేస్తే పలితాలు వస్తాయి

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రశ్నిస్తే పలితాలు రావని పనిచేస్తే పలితాలు వస్తాయని, ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ప్రతి పక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల తీప్పన్న పెట్ గ్రామంలో జిల్లా పరిషత్ నిదులు రూ. 20 లక్షలతో సీసీ, డ్రైన్ నిర్మాణ పనులకు జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ తో ఎమ్మెల్యే  భూమిపూజ చేశారు.

అంతకుముందు భారత రత్న బి అర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి  ప్రకటించారని ప్రతి పక్షాలు చేసే  అసత్య ప్రచారాలు రైతులు నమ్మవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎం ఎస్  ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ ములసాపులక్ష్మి, ఎఎంసి ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, మాజీ ఎఎంసి  ఛైర్మెన్ దామోదర్ రావు, పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, మాజీ జెడ్పీటీసీ ఎల్లా రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ రామానుజాచార్యులు, మీలింద్, ఎఇ  రాజమల్లయ్య, పాక్స్ డైరెక్టర్ పోచమల్లు, మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేష్, వార్డు మెంబర్లు సత్తయ్య, రాజన్న, లక్ష్మి, వజ్రమ్మా, శేకర్, శిరీష, నాయకులు ములసాపు మహేష్, లైషెట్టీ శేకర్, గంగన్న, చందు, తదితరులు పాల్గొన్నారు.