ఘనంగా వేణుగోపాలస్వామి డోలోత్సవం వేదసదస్సు

ఘనంగా వేణుగోపాలస్వామి డోలోత్సవం వేదసదస్సు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీమదనగోపాలస్వామి పంచాహ్నిక ధ్వజారోహణ  తిరుకల్యాణం బ్రహ్మోత్సవాలు మూడవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయంలో నిత్యహోమం, నవగ్రహహోమము, బలిహారణ, స్వామివారికి  ఘనంగా డోలోత్సవం, వేదసదస్సు నిర్వహించారు.  ఆలయ వేద పండితులు ప్రముఖ జ్యోతి, వాస్తు శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రో చ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి.

ఈసందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ.. దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు  సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని,  ప్రశాంతమైన  వాతావరణం ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా జీవనం గడిపే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దేవాలయంలో జై శ్రీమన్నారాయణ నామంతో పరిఢవిల్లుతోంది. ఈకార్యక్రమంలో వేద పండితులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.