చెట్లను తొలగించడం హరితహారానికి శాపం..

చెట్లను తొలగించడం  హరితహారానికి శాపం..

సిద్దిపేట,ముద్ర ప్రతినిధి: ఎలక్ట్రిసిటీ ఉద్యొగుల అత్యుత్సాహాం హరితహారానికి శాపంగా మారింది. సిద్దిపేట పట్టణం సుందరికరణ, హరిత సిద్దిపేట లక్ష్యంగా గత ప్రభుత్వం లో లక్షలాది మొక్కలను మునిసిపల్ ఆధ్వర్యంలో నాటారు. అవి ఇప్పుడు చెట్లు గా మరి వాతావరణాన్ని సమతుల్యం చేస్తూ సిద్దిపేట పట్టణానికి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మొక్కల నుండి అవి చెట్లు గా మారడానికి,వాటిని కాపాడుకోవడానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. కానీ సిద్దిపేట ఎలక్ట్రిసిటీ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి ఏపుగా పెరిగిన చెట్లను నరికేస్తూన్నారని మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే ఏపుగా పెరిగిన మొక్కలు విద్యుత్ వైర్లకు తగిలి ఇబ్బంది అవుతుందని సమాధానం చెబుతున్నారు.

ట్రిమ్మింగ్ ఉండగా నరకడం ఎందుకు...

విద్యుత్తు అధికారులు చెప్పిన కారణం సరైనదే అయిన చెట్లను పూర్తిగా నరికేయకుండా ట్రిమ్మింగ్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక వేళ విద్యుత్ తీగలు మరింత ఇబ్బంది గురి చేసే కొన్ని ప్రాంతాల్లో చెట్లను పూర్తిగా తీసేసిన బాగుంటుంది కానీ అవసరం లేని చోట కూడా మొత్తం చెట్లను నరికేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

నోటీసులు పంపించాం... మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి

లక్షలు ఖర్చు పెట్టి చెట్లను పిల్లల కాపాడుకుంటూ వస్తున్నాం.. కానీ ఎలక్ట్రిసిటీ అధికారులు మాత్రం కనికరం లేకుండా చెట్లను నరికేస్తున్నారు. ఈ విషయం పై కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసాం. ఎలక్ట్రిసిటీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసాం.. ఉన్నతాధికాకారుల నుండి ఎలాంటి రెస్పొన్సె లేదు. వాల్టా చట్టాన్ని అనుసరించి చెట్లను నరికిన వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఈ విషయమై ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అధికారులకు నోటీసులు అందించాం..

అనవసరంగా చెట్లను తొలగించవద్దని సిబ్బందికి సూచించాం.

ఎలక్ట్రిసిటీ ఏ ఈ మోహన్ రెడ్డి

ప్రజలకు నిరంతన విద్యుత్

అందించడానికి కృషిచేస్తున్నాం. మున్సిపల్ అధికారుల సమన్వయం తో నే విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్లను మాత్రమే ట్రిమ్మింగ్ చేస్తున్నాం. మరి అత్యవసరమైతేనే చెట్లను తొలగిస్తున్నాం. అవి కూడా ఆరోగ్యానికి హాని కారమైన కానో కార్పస్ చెట్లను మాత్రమే రెండు చోట్లా తొలగించాం.

అనవసరంగా చెట్లను తొలగించవద్దని సిబ్బందికి సూచించాం.