కారు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

కారు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

కోరుట్ల, ముద్ర: మేడిపల్లి మండల శివారులో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొనడంతో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం మృతులు మెట్పల్లి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఖైరుద్దిన్, ప్రైవేటు ఉపాధ్యాయుడు రషీద్ లుగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల తరలించినట్లు మెట్పల్లి సీఐ పి నవీన్, కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ ఎస్సై శ్యామ్ రాజు తెలిపారు. మృతుడి భార్య నస్రిన్ ఫిర్యాదు  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.