కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి

కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలో నైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్ లో గురువారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. భగీరథుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  లత మాట్లాడుతూ గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథుడు మహర్షి అని ,ఆయన పట్టుదలను ఆదర్శంగా నేటి తరం తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు,మాహనీయులు అవుతారనే దానికి  భగీరథ మహర్షి గొప్ప పట్టుదల నిదర్శనమన్నారు. సీనియర్ సిటీజన్స్,బీసీ జేఏసీ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తన ముత్తాతలకు సద్గతులు ప్రాప్తించడానికి భగీరథుడు రాజభోగాలను త్యాగం చేసి కఠోరమైన దీక్షతి దివి నుంచభువికి గంగను రప్పించిన తీరు  కన్న తల్లిదండ్రులను నిరాదరిస్తున్న నేటి  కనికరం లేని కుమారులకు కనువిప్పు కావాలన్నారు.భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం  హర్షణీయమన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చొరవతో చారిత్రక పురుషుల,సంఘ సంస్కర్తల,మహనీయుల జయంతి,వర్దంతులను అధికారికంగా నిర్వహించడం గొప్ప సాంప్రదాయమని,ఆయా వర్గాలకు ఆత్మ గౌరవ సూచిక    అని,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలవడం గర్వకారణమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి సాయిబాబా,జిల్లా అంబుడ్స్ మెన్ అధికారి కృష్ణా రెడ్డి,జిల్లా సంక్షేమ అధికారి బి.నరేష్,కలెక్టరేట్ ఏవో నాగార్జున,బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు   హరి ఆశోక్ కుమార్,లక్ష్మీనారాయణ,గంగాధర్,జలజ, శ్రీ మంజరి,బీసీ సంక్షేమ కార్యాలయంఏవో జయరాజ్, సహాయ జిల్లా సంక్షేమ అధికారి సునీత,తహసీల్దార్ కాళీచరన్, సాంస్కృతిక కళాకారుడు పరుశరామ్ గౌడ్,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సిబ్బంది,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.