జగిత్యాల రేషన్ షాప్ లలో నగదు బదిలి పథకం ..

జగిత్యాల రేషన్ షాప్ లలో నగదు బదిలి పథకం ..
  • షాప్ లో బియ్యం ఉండవు కాని డబ్బులిస్తారు 
  • కొత్త పథకానికి తెర లేపిన రేషన్ డీలర్లు 
  • ఈ తంతు అంత అధికారుల కనుసన్నల్లలోనేనా...? 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రేషన్ షాప్ ల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకుని వచ్చింది. అంటే కుటుంబ సభ్యులలో ఆహార బద్రత కార్డులో పేరు ఉన్న ఎవరయినా ఒకరు రేషన్ షాప్ కు వెళ్లి బయో మెట్రిక్ మిషన్ లో వేలి ముద్ర వేస్తే అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించ ఎన్ని కిలోల బియ్యం వస్తయో తూకం వేసి ఇస్తారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన అక్రమార్కులకు అవి ఏమి పనిచేయవు .. వారి పని వారు చూసుకుంటూ వెళ్తారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం కరోన కారణంగా రేషన్ షాప్ లలో ఉచితంగానే బియ్యం పంపిణి చేస్తున్నారు. లబ్దిదారులు వేలిముద్ర వేసి ఉచితంగానే బియ్యం తీసుకుని వెళ్ళాలి.. కాని జగిత్యాలలో ...

కొత్త పథకానికి తెరలేపిన రేషన్ డీలర్లు
రేషన్ షాపులలో అక్రమాలు అరికట్టేందుకు ... రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం రేషన్ బియ్యం కొనుగోలు చేసే డబ్బులను ప్రత్యక్షంగా ఆహార బద్రత కార్డ్ కలిగిన లబ్దిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లయితే లబ్దిదారుడు బ్యాంకులో జమ అయిన డబ్బులతో తన ఇష్టం వచ్చిన బియ్యం దుకాణాలు, కిరాణం షాపులలో బియ్యాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అని వారి ఆలోచన.... కానీ ఈ పద్దతిని ప్రబుత్వం ఇంకా అమలులోకి తీసుకొని రాలేదు. కానీ జగిత్యాల పట్టణంలోని కొందరు రేషన్ డీలర్లు ఆ పథకానికి తెర లేపారు.  ఆ రేషన్ షాప్ లో బియ్యం ఉండవు.. బియ్యం ఇవ్వరు  కాని లబ్దిదారులు వెళ్తే మాత్రం డబ్బులిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకంటే మన రేషన్ డీలర్లు  చాల ముందంజలో ఉన్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల పట్టణం దరూరు క్యాంపుకు చెందిన ఆహార బద్రత కార్డు కలిగిన ఓ లబ్దిదారుడు హౌసింగ్ బోర్డులో ఉన్న రేషన్ షాప్ కి వెళ్ళాడు .. అక్కడ ఆ డీలరు  బియ్యం అయిపోయాయని చెప్పడంతో పట్టణంలోని నిజామబాద్ రోడు, అరవింద నగర్, తదితర ప్రాంతాల్లో రేషన్ షాపుల్లో బియ్యం కోసం ప్రయత్నించాడు. ఎక్కడ లబించలేదు. కానీ గంజురోడులో  ఒక షాప్ లో బియ్యం ఉన్న్తాయని అడ్రస్ చెప్పారు. సదర్  లబ్దిదారుడు ఆ షాపుకు వెళ్ళగా బియ్యం లేవు కాని బియ్యానికి బదులు డబ్బులు ఇస్తానని చెప్పడంతో జగిత్యాలలో బియ్యం ఎక్కడ లెకపోవడంతో డబ్బులు తీసుకుని బియ్యం బయట కిరణం షాపులో కొందామని అనుకోని ఆ లబ్దిదారుడు సరే అన్నాడు. అంతే బయోమెట్రిక్ లో వేలి ముద్ర వేయమని చెప్పి లబ్దిధారుని కార్డులో నలుగురు కుటుంబ సభ్యలు ఉండగా కిలో కు రూ. 8 చొప్పున  ఆయనకు రావాల్సిన 24  కిలోలాకు రూ.192 చెల్లించగా బయట మార్కట్లో ఆ లబ్దిదారుడు బియ్యం కొనుగోలు చేసేందుకు వెళ్ళగా అక్కడ కనిష్ట ధర కిలో రూ. 36 ఉండగా 5 కిలోల బియ్యం కొనుగోలు చేసుకొని వెళ్ళాడు .. నెలకు 24 కిలోల బియ్యంతో వేల్లదిసే ఆకుటుంబం ఈ నెల మాత్రం ఓ పూట  పస్తులుండి 5 కిలోల బియ్యంతో సరి పెట్టు కోవలసిన పరిస్థితి వచ్చింది. హన్మనువాడకు చెందిన్ మరో లబ్దిదారుడి పరిస్థితి కూడా అంతే సదరు లబ్దిదారుడు కూడా గంజు ప్రాంతంలోని మరో రేషన్ షాపుకు వెళ్ళగా అక్కడ కొంత మెరుగుగా  కిలోకి రూ.12.50  చొప్పున 24 కిలోలకు రూ. 300 చెల్లించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణంలో కోకొల్లలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటె పట్టణంలోని ఓ రెండు రేషన్ షాపుల పక్కన కిరాణం షాపులు ఉంటాయి ... అక్కడ మరోల ఉంటుంది . ఆ రేషన్ షాపులకు వచ్చే లబ్దిదారులు కొనుగోలు చేసిన వెంటనే అక్కడే కిలో రూ. 8 నుంచి రూ. 9 కొనుగోలు చేసి పెద్దమొత్తం జమ అయ్యాక రైసు మిల్లులకు తరలిస్తున్నారు. రేషన్ షాపుల నుంచి, లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్ మిల్లులలో రీసైక్లింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా లారీలలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మరికొందరు అయితే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి  ఇటుక బట్టీలలో పనిచేసే ఓడిస్సా కార్మికులతో పాటు పలువురు కార్మికులకు విక్రయిస్తున్నారు.  ప్రభుత్వం ఆహార బద్రత కార్డ్ కలిగిన వారు ఎక్కడ ఆయన బియ్యం తీసుకోవచ్చని సడలింపు కలిగించడంతో ఆ వార్డు ప్రజలకు బియ్యం అయిపోయాయని కుంటి సాకులు చెప్పి లబ్దిదారులకు ఇవ్వకుండానే బియ్యాన్ని మాయం చేస్తున్నారు రేషన్ డీలర్లు.

ఉన్నత అధికారులు ఉన్న జిల్లా కేద్రంలోనే అక్రమాలు
జగిత్యాల జిల్లా కేద్రం అయిన జగిత్యాల పట్టణంలో 56 రేషన్ షాపులు ఉండగా 29,238 ఆహార బద్రత కార్డులు,1451 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు నెలకు 5, 86,135 కిలోల బియ్యం పంపిణి చేస్తారు. జిల్లా వ్యాప్తంగా  2,93,042 ఆహార బద్రత, 14, 431  అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటికి నెలకి 5605 క్వింటాళ్ళ బియ్యం సరపర చేస్తారు. అయితే సివిల్ సప్లయ్, టాస్క్ పోర్స్ పోలీసులు కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు ఉండే జగిత్యాల పట్టణంలోనే ఇలా జరుగుతే ఇక జిల్లా మొత్తంలో రేషన్ షాపుల్లో ఏమేరకు అక్రమాలు జరుగుతున్నాయో అంచనా వేయోచ్చు. రేషన్ షాపులో బియ్యం లేకుండా డబ్బులు ఇవ్వడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రేషన్ షాపుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుని సామాన్యులైన లబ్ధిదారులందరికీ రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.