సీపీఎస్ విధానం రద్దు టిఎస్ సిపిఎస్ ఇయు అధ్వర్యంలో నిరసన ..

సీపీఎస్ విధానం రద్దు టిఎస్ సిపిఎస్ ఇయు అధ్వర్యంలో నిరసన ..

సీపీఎస్ విధానం రద్దు టిఎస్ సిపిఎస్ ఇయు అధ్వర్యంలో నిరసన ..

అంబేద్కర్ విగ్రహానికి వినతి ..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఎస్ సిపిఎస్ ఇయు ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగ,ఉపాధ్యాయలు జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ నుంచి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లడుతూ ఉద్యోగుల సామాజిక భద్రత పాత పెన్షన్ అమలు చేయాలని అన్నారు.

*అంబేద్కర్ ను వేడుకున్న ఉద్యోగులు*

 “దూరదృష్టితో మీరు రచించిన భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 309 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ లు రాష్ట్ర పరిధి లొనే ఉండాలి కానీ దీన్ని కాలరాస్తు ఉద్యోగి సామాజిక భద్రత పి.ఎస్.ఆర్.డి.ఆ చట్టం ద్వారా షేర్ మార్కెట్ పాలు అవుతోంది. సీపీయస్ విధానం ఆర్టికల్ 14 కు విరుద్ధం ఒకే స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన సామాజిక భద్రత లేక పోవడం, వాటి ప్రభుత్వలు తెచ్చిన PERDA చట్టం ను రద్దు చేసేలా, మాకు సామాజిక భద్రతను, పెన్షన్ లేకుండా చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను రద్దు చేసి, మా రాష్ట్ర ప్రభుత్వం మాకు పాత పెన్షన్ అమటు జరిపేల ప్రభుత్వల యొక్క మనస్సు మార్చి మా యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని” అంబేద్కర్ ను వేడుకున్నారు.

ఉపాధ్యాయులకు టీఎన్జీవో నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ సిపిఎస్ ఇయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గంగాదరి మహేష్, నర్ర సతీష్, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, బోగ శ్రీనివాస్, జి. గణేష్, అల్లే రాజేందేర్, అరికె రవికుమార్, బి. ఆంజనేయులు, గాదే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.