టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు..

టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించింది. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.