కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసిన బండి సంజయ్

ముద్ర,తెలంగాణ:-కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్‌లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు. జై మోదీ… జై జై బండి సంజయ్… జై తెలంగాణ..భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు బీజేపీ శ్రేణులు.`