ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య
  • ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రూపాదేవి
  • మేడిపల్లి సత్యం రూపాదేవి లది ప్రేమ వివాహం
  • గతవారం ఐదు రోజులపాటు పుణ్యక్షేత్రాల సందర్శన
  • షాక్ కు గురైన కాంగ్రెస్ శ్రేణులు, సత్యం అభిమానులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ లోని తన సొంత నివాసంలో రాత్రి 10:30 సమయంలో ఉరి వేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన కొంపల్లిలోని రెనోవ హాస్పిటల్ కు తరలించారు. వారికి 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల పాప ఉన్నారు.

గతవారం తిరుపతి, కంచి, కాణిపాకం తోపాటు పలు పుణ్యక్షేత్రాలను ఐదు రోజులపాటు సందర్శించి వచ్చారు. ఇంతలోనే ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. 2010 బ్యాచ్ కి చెందిన రూపాదేవి మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండల్ రావల్కోల్ గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మేడిపల్లి సత్యం రూపాదేవి 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.