డిజిటల్ విద్యాబోధనకు శ్రీకారం

డిజిటల్ విద్యాబోధనకు శ్రీకారం

శంకరపట్నం, ముద్ర జూన్ 28 : శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ విద్యా బోధన ప్రారంభించారు. బుధవారం రోజున జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల కన్నాపూర్ లో శంకరపట్నం  జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఐ ఎఫ్ పి స్క్రీన్ ను ప్రారంభించి డిజిటల్ తరగతి విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపెల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను  కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

కన్నాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందున్నారని ఆయన తెలిపారు.అనంతరం రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొని పథకాలు సాధించిన విద్యార్థినులను అభినందించి,ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులను, పి ఇ టి  , కోచ్ సంపత్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, చౌడమల్ల వీరస్వామి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.