కరీంనగర్ లో బీకర వాన

కరీంనగర్ లో బీకర వాన
  • లోయర్ మానేరు డ్యాం బిగ్ అలెర్ట్
  • ఏ క్షణమైనా గేట్లు తెరవచ్చు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భీకర వాన కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు  పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ఎల్ఎండి డ్యాం నిండుకుండలా మారింది. ఈ క్షణమైనా గేట్లు ఓపెన్ చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఎల్ఎండి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని గొర్రెల కాపరులు బయటకు వెళ్లొద్దని అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. మరో రెండు రోజులపాటు అల్పపీడనద్రోణి కొనసాగే అవకాశం ఉందని దీంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.