జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లను సన్మానించిన ఎంపిటిసి

జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లను సన్మానించిన ఎంపిటిసి

ముద్ర.వీపనగండ్ల:- కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వీపనగండ్ల మండల కేంద్రానికి వచ్చిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ లను వీపనగండ్ల ఎంపీటీసీ గుండ్లపల్లి భాస్కర్ రెడ్డి శాలువా కప్పి సన్మానం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి కలెక్టర్ ను కోరారు. తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణం. ఎస్సీ గురుకుల భవన నిర్మాణం, వనపర్తి నుంచి వీపనగండ్ల మీదుగా కొల్లాపూర్ కు బస్సు సౌకర్యం, 30 పడకల ఆసుపత్రికి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ను కోరారు.కార్యక్రమంలో తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము ఉన్నారు.