కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోని సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోని సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

ముద్ర.వీపనగండ్ల:-60 సంవత్సరాలుగా రాని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష వందలాదిమంది యువత ఆత్మహత్య చేసుకుంటే చూడలేక, తల్లిగా సోనియమ్మ అర్థం చేసుకొని ఆంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీపనగండ్ల కాల్వరాల గ్రామాలలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేశానని గుర్తు చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా సింగూటం జొన్నల బొగడ రిజర్వాయర్ నుంచి నుంచి కొల్లాపూర్ ప్రాంతా రైతాంగానికి సాగు నిరందించింది కాంగ్రెస్ పార్టీని అన్నారు. యువత ఆత్మహత్యల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి, మంత్రి పదవి, ఎంపీ పదవులతో రాజభోగం అనుభవిస్తున్నదని, ఉద్యమకారులను కాదని ఏలాంటి అర్హతలు లేని తన అల్లుడి కి రాజ్యసభ పదవిని కట్టే పెట్టారని విమర్శించారు, దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందని, దేశ ప్రతిష్ట కోసం దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, విద్యుత్ బకాయిలతో ఆనాడు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే వారి కష్టాలను తీర్చడానికి ఉద్యమాలు చేసి జైలు శిక్ష అనుభవించానని, రైతుల బకాయిలను మాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేయగా, అప్పటి నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాలను మాఫీ చేసి ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి సంతకం చేశారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పదిని కూడా త్యాగం చేశానని, రాష్ట్ర ఏర్పాటులో తన భాగస్వామ్యం ఉందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అందులో తన కృషి కూడా ఉందని అన్నారు. కొల్లాపూర్ లో అభివృద్ధి జరిగిందంటే జూపల్లి కష్టం ఆశీర్వాదం కూడా ఉందని, ఎమ్మెల్యే బీరం లా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి డబ్బుల కోసం అమ్ముడుపోలేదని విమర్శించారు.సింగోటం బ్రిడ్జి నిర్మాణంలో నష్టం వచ్చినదని కేసులు వేసి ప్రభుత్వం ద్వారా ఎవడబ్బ సొత్తు అని 26 కోట్ల రూపాయల తీసుకున్నామని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ప్రభుత్వ సొత్తును దోచుకోవటమే తప్ప అభివృద్ధి చేసింది లేదని, అందుకే ఎన్నికల్లో అధికార పార్టీ  అభ్యర్థులు,నాయకులు డబ్బులు ఇస్తే తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా 2500, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్,రైతు భరోసా ప్రతి ఏటా.15000 (రైతులు, కౌలు రైతులకు)12000 (వ్యవసాయ కూలీలకు)వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్, గృహ జ్యోతి ద్వారాప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి.5 లక్షలు,ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం,యువ వికాసం ద్వారావిద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు,ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి పథకాలను అందించడం జరుగుతుందని తెలిపారు,కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఏత్తం కృష్ణయ్య,నారాయణ రెడ్డి, పానగల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి మాజీ సర్పంచ్ గంగిరెడ్డి,మహిళా నాయకురాలు సుకన్య, తేజమ్మ,చిట్టెమ్మ, మండల కిసాన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, బొల్లారం సుదర్శన్ రెడ్డి, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అద్యక్షులు మీసాల రాము,నాయకులు నరేందర్ రెడ్డి,వెంకటయ్య,విష్ణు, రాజశేఖర్,కాల్వరాల లో చక్ర వెంకటేష్,వెంకటరాజయ్య,పెద్ద వెంకటేష్,నరసింహ, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.