కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం

కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం

ముద్ర/వీపనగండ్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఎంపీటీసీ కవితకృష్ణ అన్నారు. మండల పరిధిలోని బొల్లారం,కొర్లకుంట లో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.నీళ్లు నిధులు నియామకాలు అంటూ  తెలంగాణ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడని, దళితులకు మూడెకరాల భూమి, లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసారని విమర్శించారు.రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని ప్రజలకు వివరించారు, కార్యక్రమంలో నాయకులు గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.