లారీల దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్: సీఐ శ్రీనివాస్ రెడ్డి

లారీల దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్: సీఐ శ్రీనివాస్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : ఒక దొంగతనం నుండి బయట పడేందుకు తరచుగా దొంగతనాలు చేస్తూ జల్సా లకు అలవాటు పడ్డ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తకోట పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2006లో ఓ లారీని కొనుగోలు చేసుకుని అది అమ్మగా ఆర్థిక నష్టాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ చెందిన అచ్చంట గంగాధర్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.  పట్టణంలోని చౌరస్తాల్లో బుల్లెట్ వాహనంపై వెళుతూ  తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంతో పట్టుకొని అనుమానం రావడంతో విచారించగా గత నెల 8వ తేదీన కురుమూర్తి పెట్రోల్ బంక్ లో ఆపిన లారీని దొంగ తాళంతో లారీని దొంగిలించినట్లు, దీంతో కొత్తకోట పట్టణంలో మరో ఓ బుల్లెట్ వాహనం కూడా దొంగిలించినట్లు విచారణలో తెలిపాడు.  కాగా ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.   విలేకరుల సమావేశంలో ఎస్సై నాగ శేఖర్ రెడ్డి,  యుగంధర్ గౌడ్,  మహేష్ తదితరులు ఉన్నారు.