భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు..

భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు..

ముద్ర,తెలంగాణ:- తన భార్య గత కొన్ని నెలల నుండి కాపారానికి రావడం లేదని తమ కుటుంబ సభ్యులు పట్టించుకోవడంలేదని.. మెదక్ మండలంలోని ఆవుసులపల్లి గ్రామంలో జైల్ సింగ్ అనే వ్యక్తి 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. విద్యుత్ తీగలు తగిలి చెలరేగిన మంటలు. ఈ సంఘటన లో యువకుడి కాలుకి తీవ్ర గాయం అయ్యింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తన భార్య గత కొన్ని నెలల నుండి కాపారానికి రావడం లేదని తమ కుటుంబ సభ్యులు పట్టించుకోవడంలేదని మనస్థాపానికి గురై విద్యుత్ స్తంభం ఎక్కినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ కొల్చారంలో ఇలాగే విద్యుత్ స్తంభం ఎక్కిన జైల్ సింగ్.