పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా స్టార్ మరో తెలుగు స్టార్ హీరో

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా  స్టార్ మరో తెలుగు స్టార్ హీరో

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల బరిలో నిలిచారు.ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తుండగా.. తాజాగా మరో స్టార్ హీరో సపోర్ట్ పవన్ కళ్యాణ్‌కు దక్కింది. నేచురల్ స్టార్ నాని.. పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ హీరో నాని ఎక్స్‌లో ట్వీట్ చేశారు

‘డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కోబోతున్నారు.ఈ రాజకీయ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని సినీ ఫ్యామిలీకి చెందిన సభ్యుడిగా ఆశిస్తున్నా. నాతోపాటు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు.