వన్యప్రాణుల వేట నిరోధానికి క్యాచ్ ది ట్రాప్

వన్యప్రాణుల వేట నిరోధానికి క్యాచ్ ది ట్రాప్

రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ ప్రత్యేక డ్రైవ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా వన్యప్రాణుల వేటను నిరోధించడానికి ''క్యాచ్ ది ట్రాప్'' పేరుతో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా అటవీశాఖ అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సంచరించి వేటగాళ్ళను గుర్తించి, వారు వాడే పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలను పరిశీలించి, అనుమానితులను సోదా చేస్తారు. వేటకు ఉపయోగించే వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విష పదార్ధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకుంటారు.

వేటగాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను హైదరాబాద్ లోని అటవీశాఖకు చెందిన కార్యాలయానికి తరలించనున్నారు. అలాగే ఇన్ ఫార్మార్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ప్రత్యేక డ్రైవ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి తగిన ప్రోత్సాహం అందజేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేటకు సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే సంబంధిత అధికారికి లేదా 9803338666, టోల్ ఫ్రి నెంబర్ 180004255364కు తెలిపాలని అధికారులు కోరారు.