ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. పెరుగుతున్న ఉత్కంఠ

ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. పెరుగుతున్న ఉత్కంఠ
  • నవీన్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి
  • ఓటుకు రూ.3 నుంచి 5 లక్షలని ప్రచారం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు జిల్లా: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఓటు హక్కు కలిగిన సభ్యులను ప్రతిపక్ష పార్టీ గోవాకు తీసుకెళ్లారు.కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు చెందిన ఒక్క ఓటుకూడా పక్కకు వెళ్లకుండా సభ్యులకు నజరానాలు ఇస్తూ క్రాస్ ఓటింగ్ జరగకుండా జగ్రత్తలు పడుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీలో లేనందున ఆ పార్టీకి చెందిన సభ్యులు ఎవరికైనా తమ ఓటు వేసుకోవాలని స్వేచ్ఛ ఇవ్వడంతో, వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బేరసారాలు చేస్తున్నారు.అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న నాయకులకు ఒక్క ఓటుకు రూ.3 నుంచి 5 లక్షలవరకు ఇస్తున్నారనే సమాచారం. మరి కొందరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కేటా యిస్తారా అంటూ, కాంగ్రెస్, బీజేపీ నేతలతో ఒప్పందం చేసుకుంటున్నారు. గోవాలో టూర్ లో ఉన్న ఓటర్లంతా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయనున్నారు.