ఈ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా మరోసారి శ్రీధర్ బాబును ఆశీర్వదించాలి
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని టి పిసిసి ప్రధాన కార్యదర్శి, మంథని నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ కసుభ శ్రీనివాస రావు కోరారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు బలంగా ఇస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అత్యున్నత స్థానంలో ఉండే దుద్దిల్ల శ్రీధర్ బాబును మంథని నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని, పక్కా ప్రణాళికతో ముందుకు పోతూ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యులు శేశిభూషణ్ కాచే, మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మండల కార్యనిర్వహక అధ్యక్షుడు బూడిద శంకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, జిల్లా సెక్రెటరీ ఉదరి శంకర్, మండల వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.