లక్ష్మాపూర్ లో  కుస్తీ పోటీలు

లక్ష్మాపూర్ లో  కుస్తీ పోటీలు

 పెద్ద శంకరంపేట, ముద్ర: మాణిక్ ప్రభు జాతర ఉత్సవాల్లో భాగంగా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మక్త లక్ష్మాపూర్ లో శనివారం నిర్వహించిన కుస్తీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్న వస్తాదుల నుండి పెద్ద  మల్లయోధుల వరకు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొని తమ యొక్క ప్రతిభను చాటుకున్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు వివిధ మండలాలు ఆయా ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మల్లయోధులు పోటీల్లో పాల్గొని తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.

నారాయణఖేడ్, కంగ్టి,  కల్హేర్, సిర్గాపూర్, తడకల్, పిట్లం, తదితర ప్రాంతాల నుండి మల్లయోధులు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. లక్ష్మాపూర్ గ్రామం తో పాటు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కుస్తీ పోటీలను తిలకించడానికి తరలివచ్చారు.  కుస్తీ పోటీల్లో గెలుపొందిన వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పల్లె రవి, పల్లె కృష్ణ,   శ్రీశైలం, శ్రీనివాస్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు