దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం

దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం
  • ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్ నిలుస్తుంది
  • తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
  • జూన్ 4 తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్కులు
  • మీడియా సమావేశంలో అందె బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి

ముద్ర/షాద్ నగర్:- దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం అని బిజెపి రాష్ట్ర కార్యదర్శిలు అందే బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్ నగర్ లో బిజెపి నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించాలని లక్ష్యంతోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని దేశంలోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడంతో పాటు యువతలో ఎక్కువ ఉత్సాహం వచ్చిందని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తో ప్రజల్లో నరేంద్ర మోడీపై మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు.

ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శ దేశంగా నిలిపెందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. దేశంలో ఉన్న అన్నదాతలకు పెద్దపీట వేయడంతో పాటు సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ దేనిని అన్నారు. భారతదేశంలో ఒక అగ్ర దేశంగా తయారు చేసేందుకు నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలని సంకల్పంతో నిధులను ఎక్కువ మొత్తంలో ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దాంతో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉత్సాహం చూపించారని గుర్తు చేశారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.

తెలంగాణలో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవడంతో పాటు పాలమూరు పార్లమెంటు సీటు లక్ష మెజార్టీతో డీకే అరుణమ్మ విజయం సాధించడం ఖాయమని భీమా వ్యక్తం చేశారు. బూతు స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి బిజెపి కార్యకర్త ఐక్యమత్యంతో సమిష్టి కృషితో, పట్టుదలతో పని చేయడంతోనే విజయం సాధించడం ఖాయమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడ లేదని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ అస్తిత్వం పూర్తిగా కోల్పోతుందని జ్యోతిష్యం చెప్పారు. నార్త్ లో త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే 14 వేల కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందని, సౌత్ లో త్రిబుల్ ఆర్ రోడ్డు పూర్తి చేసేందుకు మరికొన్ని వేల కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

బిజెపి నేతలు సమిష్టిగా పని చేయడంతోనే పోలింగ్ బూత్ లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మొత్తంలో ఓట్లు వేశారని, ఎందుకు ప్రతి బిజెపి కార్యకర్తకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ఇదే స్థాయిలో బిజెపి కార్యకర్తలు పని చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరు వెంకటేష్ గుప్తా, బిజెపి నేతలు చెంది మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కమ్మరి భూపాల చారి, నరసింహ, వంశీ, రిషికేష్ లు ఉన్నారు.