హెచ్ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడి

హెచ్ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడి

శంషాబాద్, ముద్ర : సర్వే చేయడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 725/21,23/24 లలో 108 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉండగా ఈ భూమిని ప్రభుత్వం అవసరాల నిమిత్తం గతంలో భూసేకరణ చేసింది అప్పటినుండి ఈ భూమిని ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ భూమిని హెచ్ఎంటి అధికారులు ఎడి సర్వే చేయడానికి సైట్ వద్దకు రాగా అక్కడ కొంతమంది ఆ భూమిని ఆక్రమించి రేకులతో కూడిన ప్రహరీ గోడ నిర్మాణం చేయగా అధికారులు రేకులు తొలగించే క్రమంలో భూకబ్జాదారులకు అధికారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో భూ కబ్జాదారులు అధికారులపై రాళ్ల దాడి చేసి జెసిబిలపై బండరాళ్లు వేశారు. హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురించి హెచ్ఎండిఏ అధికారులను మీడియా మిత్రులు అడిగే ప్రయత్నం చేయగా తాము ఏమి చెప్పలేము అని హెచ్ఎంటి అధికారులు తెలిపారు. కనీసం సర్వేకి వచ్చిన అధికారుల పేర్లు కూడా అధికారులు తెలుపకపోవడం విచిత్రం.